: ఐఎస్ఐఎస్ పై యుద్ధానికి కదలనున్న భారత దండు!
ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమించిన ఐఎస్ఐఎస్ పై యుద్ధానికి భారత సైన్యాన్ని పంపనున్నట్టు రక్షణమంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. వాషింగ్టన్ లో అమెరికా రక్షణ మంత్రి ఆస్టర్ కార్టర్ తో సమావేశం అనంతరం, ఐఎస్ఐఎస్ పై లభించే ఏ సమాచారాన్ని అయినా పంచుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు తెలిపారు. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని సంకీర్ణ దళాల్లో భారత సైన్యం భాగంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. "మేము స్పష్టంగా చెబుతున్నాం. ఐరాస నిర్ణయం మేరకు, ఐరాస జెండా కింద మేం యుద్ధం చేస్తాం" అని ఆయన అన్నారు. ఈ నెల ఆరంభంలో పారిస్ లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న ఇండియా, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు తీసుకునే చర్యలకు మద్దతిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.