: మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు: సీపీ గౌతం సవాంగ్

‘కాల్ మనీ వ్యవహారంలో మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు’ అని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాల్ మనీ వ్యవహారంలో రాజకీయ నేతల ప్రమేయమున్నట్లు ఇప్పటి వరకూ తమ దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. కాల్ మనీ వ్యవహారం ఎప్పటి నుంచో ఇక్కడ ఉందన్నారు. రెండు నెలల క్రితమే తాను లీవ్ కు దరఖాస్తు చేసుకున్నానని, ఈ నెల 27న తిరిగి విధులకు హాజరవుతానని ఆయన చెప్పారు. అయితే, విజయవాడకు ఇన్ చార్జి సీపీ గా వస్తున్న ఆయన ఇంకా సమర్థుడని అన్నారు. ఆయనకు విజయవాడ సీపీగా పనిచేసిన అనుభవం కూడా ఉందన్నారు.

More Telugu News