: ‘యోగ’ నేర్చుకోమని ఎవరినీ బలవంతపెట్టం: సుప్రీంకోర్టు
‘యోగ నేర్చుకోమని ఎవరినీ బలవంతపెట్టమని’ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాఠశాల విద్యలో యోగాను తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలంటూ ఒక వృద్ధ న్యాయవాది జేసీ సేథ్(85) కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు త్వరగా తీర్పు ఇవ్వాలని ఆయన విన్నవించుకున్నారు. తనకు ఇంత వయస్సు ఉన్నప్పటికీ తాను కోర్టుకు వచ్చి వాదించగలగడానికి కారణం క్రమం తప్పకుండా యోగ ప్రాక్టీస్ చేయడమేనని సేథ్ అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ, ‘పిల్ పై అంత తొందరగా స్పందించాల్సనంత అవసరమేమీ లేదు. మీరు క్రమం తప్పకుండా యోగ ప్రాక్టీస్ చెయ్యండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆటంకపరచరు. కానీ, యోగ చెయ్యమంటూ ఎవరినీ మేము మాత్రం బలవంతపెట్టము’ అని ధర్మాసనం పేర్కొంది.