: కాల్ మనీ వ్యవహారంపై ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు

విజయవాడలో కలకలం రేపుతోన్న కాల్ మనీ వ్యవహారం ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు చేరింది. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, జేడీ శీలం, కేవీపీ, సుబ్బరామిరెడ్డి, సుంకర పద్మశ్రీలు ఈ మేరకు ఢిల్లీలోని ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్ర హెచ్ ఆర్సీలో ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలవగా, ఏపీ సీఎస్ కు నోటీసులు జారీ చేసి వివరణ కోరిన సంగతి తెలిసిందే.

More Telugu News