: టీ టీడీపీ నేతలతో నేడు నారా లోకేశ్ భేటీ... గ్రేటర్ ఎన్నికలపైనే ప్రధాన చర్చ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు పార్టీ తెలంగాణ శాఖ వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన టీ టీడీపీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తదితరులు హాజరుకానున్న ఈ భేటీలో జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఎన్నికలతో పాటు మాజీ మంత్రి విజయరామారావు పార్టీ వీడుతున్న వ్యవహారంపైనా లోకేశ్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విజయరామారావును టీఆర్ఎస్ లో చేరకుండా నిలువరించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా లోకేశ్ పార్టీ నేతలతో చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

More Telugu News