: కేరళలో రాజకీయ అంటరానితనం ఉంది: ప్రధాని మోదీ

కేరళ రాష్ట్రంలో రాజకీయ అంటరానితం కారణంగా బీజేపీ ఇబ్బందిపడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తొలిసారి కేరళ పర్యటనకు వెళ్లిన ఆయన త్రిసూరులో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు.‘కేరళ ప్రజలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ఎందుకంటే, ఈ రాష్ట్ర పర్యటనకు ఆలస్యంగా వచ్చినందుకు. ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేరళలో సాధువులు సామాజిక అంటరానితనాన్ని ఇక్కడి నుంచి పారద్రోలారు. కానీ, కొంతమంది కారణంగా ఇక్కడ రాజకీయ అంటరానితనం మాత్రం పోలేదన్నారు. కేరళలో చాలా మంది బీజేపీ కార్యకర్తలు రాజకీయ హత్యలకు గురయ్యారని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారందరికీ తాను నివాళులర్పిస్తున్నానన్నారు. కేరళ బీజేపీ కార్యకర్తల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, వారిని అభినందిస్తున్నానని మోదీ అన్నారు. ఇటీవల తన యూఏఈ పర్యటనలో అక్కడి భారతీయులతో ముఖ్యంగా కేరళ ప్రజలతో సమావేశమైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేరళ యువత ఎంతో తెలివిగలవారని, వారి నూతన ఆలోచనా విధానం దేశానికి ఎంతో అవసరమని అన్నారు.

More Telugu News