: రణ్ బీర్, రణ్ వీర్ ఇద్దరితోనూ చనువుంది: దీపికా పదుకొనే

బాలీవుడ్ ప్రముఖ నటులు రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్ ఇద్దరితోనూ చనువుగా ఉంటానని దీపికా పదుకొనే తెలిపింది. 'బాజీరావ్ మస్తానీ' సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, పరిస్థితులను బట్టే వారిద్దరితో చనువుగా వ్యవహరిస్తానని చెప్పింది. రణ్ బీర్ కపూర్ పెద్దగా మాట్లాడడు కనుక తాను మాట్లాడాల్సి వస్తుందని, అదే రణ్ వీర్ సింగ్ అయితే తాను మాట్లాడాల్సిన పని ఉండదని, అన్నీ ఆయనే మాట్లాడేస్తాడని చెప్పింది. దీంతో తాను ఒత్తిడిలో పడాల్సిన అవసరం లేదని దీపికా పదుకొనే చెప్పింది. దీపికా తాజా వ్యాఖ్యలతో మొత్తానికి ఇద్దర్నీ భలే హేండిల్ చేస్తోందని చెవులు కొరుక్కుంటున్నారు.

More Telugu News