: రచయిత సత్యమూర్తి మృతి పట్ల బాలకృష్ణ సంతాపం

సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ రచయిత సత్యమూర్తి మరణం పట్ల నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం తెలిపారు. సత్యమూర్తితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను నటించిన 'బంగారు బుల్లోడు', 'భలేదొంగ' చిత్రాలకు సత్యమూర్తి రచయితగా పనిచేశారని బాలయ్య చెప్పారు. అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి చెన్నైలోని తన నివాసంలో దేవీశ్రీ తండ్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

More Telugu News