: చంద్రబాబు, కేసీఆర్ ఏకాంతంగా 15 నిమిషాలు చర్చించుకున్నారు: రావెల
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు 15 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారని మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల చరిత్ర, అభివృద్ధి గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారని చెప్పారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. అంతకుముందు మామూలుగా చంద్రబాబు, కేసీఆర్ ల భేటీ గంటన్నర జరిగింది.