: రూపాయి మరింత పతనం... రూ. 67 దాటిన డాలర్ మారకం


అమెరికా డాలర్ తో రూపాయి మారకపు విలువ మరింతగా దిగజారింది. ఈ ఉదయం ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ లో డాలర్ తో రూపాయి విలువ రెండేళ్ల కనిష్ఠ స్థాయిలో రూ. 67.09కు చేరింది. శుక్రవారం నాటి ముగింపు రూ. 66.88తో పోలిస్తే ఇది 21 పైసలు అధికం. ఆపై కొన్ని బ్యాంకుల డాలర్ల విక్రయంతో కొద్దిగా తేరుకుని ప్రస్తుతం రూ. 66.98 వద్ద కొనసాగుతోంది. అమెరికాలో ఈ వారం జరిగే పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న సంకేతాలు రూపాయిపై సెంటిమెంటును హరిస్తున్నాయని ట్రేడర్లు వ్యాఖ్యానించారు. దీనికి తోడు మూలధనం ఔట్ ఫ్లో కొనసాగుతుండటం కూడా రూపాయి పతనానికి కారణాలని వెల్లడించారు. రూపాయి పతనం మార్కెట్ వర్గాల్లో ఆందోళనను పెంచుతోంది. తక్షణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించి, కరెన్సీ విలువ మరింతగా దిగజారకుండా చూడాలన్న డిమాండ్ పెరుగుతోంది.

  • Loading...

More Telugu News