: బెజవాడ బయలుదేరిన కేసీఆర్.. సతీసమేతంగా చంద్రబాబు ఇంటికి పయనం

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడకు బయలుదేరారు. భార్యను వెంటబెట్టుకుని హెలికాప్టర్ లో బయలుదేరిన కేసీర్ మరికాసేపట్లో బెజవాడ చేరుకోనున్నారు. ఈ నెల 23న మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)లో అయుత చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి హాజరుకావాలని ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పలికిన కేసీఆర్, నేడు చంద్రబాబును ఆహ్వానించేందుకే విజయవాడ బయలుదేరారు. విజయవాడలో కాలుమోపగానే చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్న కేసీఆర్, చంద్రబాబుకు చండీయాగం ఆహ్వానపత్రికను అందజేస్తారు. కేసీఆర్ వెంట తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ లు కూడా విజయవాడ బయలుదేరారు.

More Telugu News