: పదేళ్లలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కనుమరుగు ఖాయం: టీడీపీ ఏపీ చీఫ్ కళా వెంకట్రావు
టీడీపీ ఏపీ చీఫ్ కిమిడి కళా వెంకట్రావు కాంగ్రెస్, వైసీపీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రల్లో భాగంగా నెల్లూరులో జరుగుతున్న యాత్రల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఆ రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. రానున్న పదేళ్లలో తల్లి , పిల్ల కాంగ్రెస్ లు కనుమరుగు కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే ఆ రెండు పార్టీలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అసత్య, అసందర్భ ఆరోపణలు గుప్పిస్తున్న ఆ రెండు పార్టీలను త్వరలోనే ప్రజలు గంగలో కలిపేస్తారని కళా వెంకట్రావు అన్నారు.