: మెదక్ జిల్లాలో అవమానంతో ఆత్మహత్య
చెప్పుతో కొట్టాడన్న అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పాపన్నపేట మండలంలోని కుర్తివాడలో గోపాల్ అనే వ్యక్తి వద్ద కృష్ణయ్య అనే వ్యక్తి 15 రోజుల క్రితం సైకిల్ కొనుగోలు చేశాడు. సైకిల్ కి సంబంధించిన డబ్బు చెల్లింపు విషయంలో వివాదం రేగింది. ఈ సందర్భంగా గోపాల్ ఆగ్రహంతో కృష్ణయ్యను చెప్పుతో కొట్టాడు. దీనిని అవమానంగా భావించిన కృష్ణయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుర్తివాడలో విషాదం అలముకుంది.