: ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ వ్యయం 98 వేల కోట్లు
ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మించతలపెట్టిన బుల్లెట్ ట్రైన్ నిర్మాణ వ్యయం 98 వేల కోట్ల రూపాయలని అంచనా వేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబె మధ్య బుల్లెట్ ట్రైన్ నిర్మాణం గురించి ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా భారత్ ప్రధాని మాట్లాడుతూ, నమ్మకం, నాణ్యతను దృష్టిలో పెట్టుకుని జపాన్ హై స్పీడ్ రైల్ నెట్ వర్క్ అయిన షింకెన్ సన్ తో కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టనున్నామని అన్నారు. షింజో అబె మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో భారత్ బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతోందని తెలిపారు.