: బుజ్జి 'జివా' ఎంత ముద్దుగా ఉందో!: సుస్మితా సేన్
అంబానీలు ఇచ్చిన పార్టీలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జివా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. నీతూ అంబానీ, ముఖేష్ అంబానీలు ముంబైలో సన్నిహితులకు పార్టీ ఇచ్చారు. అందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జివా అక్కడ అందర్నీ ఆకట్టుకుంది. జివాను చూసిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఫిదా అయిపోయింది. 'ఎంత బుజ్జిగా ఉందో' అంటూ ముచ్చటపడిపోయింది. ధోనీ చేతుల్లో నిద్రపోతున్న జివా ఫోటోను ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసి, 'జివా ధోనీ ఎంత అందంగా ఉందో కదా?' అంటూ అభిమానులను అడిగింది. ఈ ఫోటో సుస్మితా సేన్, ధోనీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.