: ప్రజలారా... ఇందుకేనా మీరు తెలంగాణ సాధించుకుంది?: జానారెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనులు ఆందోళనలో పాల్గొన్నారని... తాము కూడా సొంత పార్టీని, పదవులను పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడామని శాసనసభలో విపక్ష నేత జానారెడ్డి అన్నారు. అంత కష్టపడి సాధించుకున్న తెలంగాణలో... ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఆవేదనను కలిగిస్తున్నాయని మండిపడ్డారు. మీరంతా ఎన్నో ఆశలతో ఎన్నుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని... ఈ విషయాన్ని అంతా గమనించాలని ప్రజలనుద్దేశించి అన్నారు. ఇందుకేనా మీరు తెలంగాణను కోరుకుంది? అని ప్రశ్నించారు. మేధావులు కూడా దీనిపై స్పందించాలని కోరారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News