: ప్రపంచంలోని చెత్త విమానాశ్రయాలు ఇవే!
ప్రపంచంలోని అత్యంత చెత్త విమానాశ్రయాలను 'ద గైడ్ టు స్లీపింగ్ ఇన్ ఎయిర్ పోర్ట్స్' అనే ట్రావెల్ వెబ్ సైట్ విడుదల చేసింది. 2015 సంవత్సరానికి గాను అత్యంత చెత్త ఎయిర్ పోర్టులు ఇవేనని తేల్చి చెప్పింది. ప్రయాణికుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ జాబితాను తయారు చేసింది. టాప్ టెన్ చెత్త విమానాశ్రయాలు ఇవే...
1. పోర్ట్ హర్ కోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (నైజీరియా)
2. కింగ్ అబ్దుల్లాజిజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (సౌది అరేబియా)
3. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (నేపాల్)
4. తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఉజ్బెకిస్తాన్)
5. సైమన్ బొలీవర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (వెనిజువెలా)
6. టౌస్సెంట్ లూవర్చర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (హైతి)
7. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఆప్ఘనిస్థాన్)
8. టాన్ సన్ నాట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (వియత్నాం)
9. బెనజీర్ భుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (పాకిస్థాన్)
10. బ్యూవియస్-టిల్లే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ప్యారిస్).