: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయదు: సోమ్ నాథ్ భారతి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయదని ఆప్ దక్షిణ భారత ఇన్ ఛార్జి సోమ్ నాథ్ భారతి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అధికారాన్ని చేజిక్కించుకునేంత బలాన్ని సాధించాకే తాము బరిలోకి దిగుతామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆప్ ను బలోపేతం చేయడమే తమ ప్రస్తుత లక్ష్యమని సోమ్ నాథ్ భారతి అన్నారు.