: జనవరి 17న జీహెచ్ఎంసీ ఎన్నికలు?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే నెల 17న జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల తేదీ ఖరారైందని సమాచారం. ఎన్నికల సంఘం అదే రోజున ఎన్నికలు జరపాలనుకుంటోందని అంటున్నారు. దానికి సంబంధించి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ఓ కొలిక్కి వచ్చాయని, ఈ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించారని సమాచారం. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు కూడా సిద్ధం అవుతున్నాయి.