: ఇక షికాగో, టోరంటో, జెనీవాల వంతు... దాడులు చేస్తామంటూ ఐఎస్ హెచ్చరిక

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐస్) ఉగ్రవాదుల తాజా హెచ్చరికలు అమెరికా నగరం షికాగోతో పాటు కెనడా, స్విట్జర్లాండ్ నగరాలు టోరంటో, జెనీవాలను కూడా వణికిస్తున్నాయి. ముప్పేట దాడులకు దిగుతామంటూ ఐఎస్ ఉగ్రవాదులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం జెనీవాలో భద్రత మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. నగరంలోని అన్ని రోడ్లపై పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి కాని వదలడం లేదు. అంతేకాక ప్యారిస్ దాడికి పాల్పడ్డ సలాహ్ అబ్దెస్లామ్ జెనీవాలో ఉన్నాడంటూ అమెరికా స్విట్జర్లాండ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంతో నగరంలో భద్రత పెరిగింది. సిరియాలో శిక్షణ తీసుకుని వచ్చిన వారు షికాగో, టోరంటోల్లో దాడులకు యత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆ రెండు నగరాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News