: అవన్నీ మన జీన్స్ లోనే వున్నాయట!
ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు చిత్రంలో హీరోయిన్ ను "ఏదైనా పని చేసే ముందు ఓ పది సెకన్లు ఆగితే సరిపోతుంది" అని సలహా ఇచ్చే కామెడీ నటుడి పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ పని చేసే ముందు తొందరపడ్డా, ఆలస్యం చేసినా ఫలితాల్లో తేడా వస్తుంది. ఈ తరహా మనస్తత్వం మీలో ఉందా? అది మీ తప్పు కానేకాదంటున్నారు అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూరోసైకోఫార్మకాలజీ రీసెర్చర్లు. అందుబాటులోని చిన్న రివార్డు కోసం పరుగులు పెట్టి, దాని వెనకున్న భారీ బహుమతిని వదులుకునేలా ప్రవర్తించే వీరి జన్యువుల్లోనే అసలు సమస్య ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్, విభిన్నమైన ప్రొటీన్స్ కోడ్ ఈ తరహా మనస్తత్వానికి కారణమని తేల్చారు. టీనేజ్ నుంచి వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య కూడా పెరుగుతుందని చెబుతూ ఓ అధ్యయనం రూపొందించారు. ఈ అధ్యయనం విశేషాలు జర్నల్ న్యూరోసైకోఫార్మకాలజీలో ప్రచురితం అయ్యాయి.