: గూగుల్ నుంచి 'కార్డ్ బోర్డ్ కెమెరా' యాప్


సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కార్డ్ బోర్డ్ కెమెరా యాప్ ను విడుదల చేసింది. దీంతో కేవలం ఒక యాంగిల్ లోనే కాకుండా మనం ఉన్న ప్రదేశం మొత్తం కవర్ అయ్యేలా ఫోటో తీసుకోవచ్చు. 360 డిగ్రీలో మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఒకే చిత్రంలో బంధించవచ్చు. ఈ యాప్ ద్వారా ఫోటోను వీఆర్ ఫోటోలా తీయవచ్చు కూడా. ఈ యాప్ 'దగ్గర వస్తువులను దగ్గరగా, దూరంగా ఉన్న వాటిని దూరంగా'నే చూపిస్తుంది. ఫోటోతో పాటు శబ్దాలు కూడా రికార్డ్ చేయవచ్చు. కార్డ్ బోర్డ్ కెమెరా యాప్ ఫోటోను 3డీ ఫోటో మాదిరిగా కూడా చూపిస్తుంది. ఈ యాప్ ను ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News