: ఎన్ని కార్లున్నా 'స్ప్లింటర్' ప్రత్యేకతే వేరు!


జర్మనీలో ఎస్సెన్ లో మోటారు షో నిర్వహించారు. వివిధ కంపెనీలకు చెందిన వివిధ శ్రేణులకు చెందిన రకరకాల మోడళ్ల కార్లు ప్రతి ఏటా నిర్వహించే మోటార్ షోలో సందడి చేస్తుంటాయి. ఈ ఏడాది ఏర్పాటు చేసిన కార్ల షోలో 'స్ప్లింటర్' కారు అందర్నీ ఆకట్టుకుంది. చెక్కతో తయారైన ఈ కారును చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. యూఎస్ఏకి చెందిన హర్మన్ అనే వ్యక్తి రూపొందిచిన ఈ 'స్ప్లింటర్' ను తయారు చేసేందుకు ఐదేళ్ల సమయం పట్టిందని ఆయన చెప్పారు. ఈ షో డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనుంది. దీనికి ప్రతి ఏటాలాగే ఈ ఏడు కూడా విశేషమైన ఆదరణ లభించిందని నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News