: ఈ నెల 6 వరకు చెన్నై ఎయిర్ పోర్టు మూసివేత
భారీ వర్షాల కారణంగా రన్ వే పై వరద నీరు నిలిచిపోవడంతో చెన్నైలోని అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల 6వ తేదీ వరకు ఎయిర్ పోర్టును మూసివేస్తున్నట్లు విమానయాన శాఖాధికారులు తెలిపారు. నిన్న రాత్రి 8.30 గంటల నుంచి విమాన సర్వీసులు ఎక్కడి వక్కడే నిలిచిపోయాయి. దీంతో
సుమారు 700 మంది విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. వారికి ఆహారం, మంచినీటిని సిబ్బంది అందిస్తున్నారు. ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ, వర్షం కురవడం ఆగితే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రన్ వే పై ఉన్న వరద నీటిని తొలగించిన తర్వాతే ఏదైనా చేసేందుకు అవకాశముందన్నారు.