: ఈ ఏడాది మనదేశంలో భూమి 136 సార్లు కంపించింది!

ఈ ఏడాదిలో మన దేశంలో భూమి ఎన్నిసార్లు కంపించిందో తెలుసా? సుమారు 136 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. బుధవారం లోక్ సభలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా భూ ప్రకంపనలు, వాటి తీవ్రత మొదలైన విషయాలను ఆయన తెలిపారు. రిక్టర్ స్కేల్ పై 114 సార్లు 5 తీవ్రతతో, 14 సార్లు 4 తీవ్రతతో, 3 సార్లు 3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న నేపాల్ లో సంభవించిన భూకంప ప్రభావం భారత్ పై కూడా పడింది. దీని ప్రభావం కారణంగా భారత్ లో మొత్తం 102 మంది ప్రాణాలు కోల్పోగా, 13 వేల ఇళ్లు ధ్వంసమైనట్లు మంత్రి వివరించారు.

More Telugu News