: చండీయాగానికి రండి!... గవర్నర్ కు కేసీఆర్ ఇన్విటేషన్
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. హైదరాబాదులోని రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్ గవర్నర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నెల 23 నుంచి కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవలిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రం (ఫాం హౌస్)లో కేసీఆర్ ఈ చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు.
తాను నిర్వహిస్తున్న చండీయాగానికి హాజరుకావాలని ఈ సందర్భంగా కేసీఆర్ గవర్నర్ ను ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానానికి గవర్నర్ నుంచి కూడా సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 27 చండీయాగానికి వస్తున్నట్లు సమాచారం పంపిన సంగతి తెలిసిందే.