: వీడియోకాన్ నుంచి మూడు చవక స్మార్ట్ ఫోన్లు


ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ వీడియోకాన్ మూడు చవక స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. 'జడ్ 55 డిలైట్', 'జడ్ 45 డాజిల్', 'జడ్ 45 అమేజ్'ల పేర్లతో కొత్త ఫోన్లను విడుదల చేసింది. 4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్ ప్లే, 1.2 జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 1600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్రంట్, బ్యాక్ కెమెరా వంటి ఫీచర్లు కామన్ గా ఈ మూడింటిలోనూ లభిస్తున్నాయి. ఇక జడ్ 55 డిలైట్ ధర రూ.6,999గా, జడ్ 45 డాజిల్ ధర రూ.4,899గా, జడ్ 45 అమేజ్ ధర రూ.4,599గా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News