: ప్రపంచ దేశాధినేతలతో మోదీ లంచ్!

ఒకే టేబుల్ వద్ద ప్రపంచ దేశాధినేతలు లంచ్ చేశారు. పారిస్ లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఇచ్చిన విందులో పలు దేశాల అగ్ర నేతలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర నేతలతో కలిసి లంచ్ చేశారు. పలు దేశాల అగ్రనేతలు ఒకే టేబుల్ వద్ద లంచ్ చేయడం విశేషం. లంచ్ అనంతరం సదస్సులో ప్రసంగాలు కొనసాగుతాయి. కాగా, వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ప్రసంగించారు. వాతావరణ అంశం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

More Telugu News