: చింటూ రాయల్ కడప సెంట్రల్ జైలుకు తరలింపు
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ లను దారుణంగా హత్య చేసిన చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ కు చిత్తూరు జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. చిత్తూరులో కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలు లేని కారణంగా అతడిని కడపలోని కేంద్ర కారాగారానికి (సెంట్రల్ జైలు) తరలించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అనుమతితో చింటూను అదుపులోకి తీసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు అతడిని కడపకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా చింటూ తరలింపు కోసం పోలీసులు పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేశారు.