: ప్రేమలో ఓడింది, ఆటలో గెలిచింది... మరొకరితో డేటింగ్ మొదలెట్టిన టెన్నిస్ తార!


కార్లస్ మోయా, ఫ్లావియా పెన్నెట్టా... సమకాలీన టెన్నిస్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేర్లు. కొంతకాలం క్రితం వరకూ ఈ జోడి ఎక్కడ చూసినా కనిపించింది. మూడేళ్ల పాటు సాగిన వీరి ప్రేమ కథ ముగిసింది. ఓ టీవీ మోడల్ తో కార్లస్ మోయా తిరుగుతున్నాడని ఆరోపిస్తూ, పెన్నెట్టా అతనితో కటీఫ్ చెప్పుకుని ఆటపై మనసు లగ్నం చేసింది. ఆపై విజృంభించి 33 సంవత్సరాల వయసులో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను యూఎస్ ఓపెన్ రూపంలో గెలుచుకుంది. ఆ వెంటనే ఆట నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించిన టెన్నిస్ అభిమానులను నిరాశ పరిచింది. ప్రస్తుతం ఫాబియో ఫోగ్నినితో డేటింగ్ చేస్తున్న ఈ టెన్నిస్ స్టార్ ఇప్పుడు చాంపియన్స్ టెన్నిస్ లీగ్ లో భాగంగా ముంబై టెన్నిస్ మాస్టర్స్ స్క్వాడ్ లో భాగం పంచుకుంటోంది. ఓ గ్రాండ్ స్లామ్ గెలిచి, ప్రధాన టెన్నిస్ పోటీల నుంచి విరమించుకోవడం అందరికీ సాధ్యపడదని, దాన్ని తాను సాధించి చూపానని గర్వంగా చెబుతోంది. ఇక ఆట విషయాలు, వ్యక్తిగత విషయాలు వేరువేరని, గడచిపోయిన విషయాల గురించి ఆలోచించడం లేదని అంటోంది. ఇక ఇండియాకు రావడానికి కారణాలు వివరిస్తూ, ఈ పోటీల్లో ఆడాలని మార్చి, ఏప్రిల్ ప్రాంతాల్లోనే నిర్ణయించుకున్నానని వెల్లడించింది.

  • Loading...

More Telugu News