: ప్యారిస్ చేరిన ఒబామా... మరికాసేపట్లో ప్రపంచ వాతావరణ సదస్సు
ఉగ్రవాదుల దాడులతో కకావికలమైన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేరుకున్నారు. నిన్న అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఒబామా నిన్న అర్ధరాత్రికే ప్యారిస్ లోని ఓర్లీ విమానాశ్రయంలో ల్యాండయ్యారు. ప్రపంచ వాతావరణ సదస్సులో పాలుపంచుకునేందుకు వచ్చిన ఒబామాకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా 150 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇప్పటికే ప్యారిస్ కు చేరకున్నారు.
కర్బన ఉద్గారాల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు ప్రకటించనున్న ప్రపంచ వాతావరణ సదస్సు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కర్బన ఉద్గారాలను నియంత్రించే విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతోనూ పకడ్బందీ చర్యలు అమలు చేసేలా ఒప్పందంపై సంతకాలు చేయించే దిశగా ఒబామా కీలక ప్రసంగం చేయనున్నారు.