: ‘వరంగల్’లో సైనిక పాఠశాల: డిప్యూటీ సీఎం కడియం
వరంగల్ జిల్లాలో సైనిక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. వరంగల్ ఉప ఎన్నిక గెలుపుతో ప్రభుత్వంపై బాధ్యత పెరిగిందన్నారు. పత్తి రైతుల సమస్యలపై డిసెంబర్ 2న ఢిల్లీలో ప్రధానిని కలుస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకోలేదని, అందుకు నిదర్శనం టీఆర్ఎస్ సాధించిన అమోఘమైన విజయమేనని కడియం అన్నారు.