: మేము గెంటేసిన నేతకు బీజేపీ వల: ఆప్


గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి, ఆపై గెంటి వేయబడ్డ ప్రశాంత్ భూషణ్ కు బీజేపీ వల వేసిందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. బీజేపీలో చేరేందుకు ప్రశాంత్ తో పాటు ఆయన తండ్రి శాంతి భూషణ్ కూడా నిర్ణయించుకున్నారని, అందువల్లే తాము ప్రవేశపెట్టాలని చూస్తున్న జన్ లోక్ పాల్ బిల్లుపై విమర్శలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి రాఘవ్ చద్దా ఆరోపించారు. గతంలో అరవింద్ కేజ్రీవాల్ 49 రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన బిల్లునే యథాతథంగా ఇప్పుడూ తెస్తున్నామని, ఆనాడు లేని అభ్యంతరాలు ఈనాడు ఎందుకు వస్తున్నాయో తొలుత ప్రశాంత్ భూషణ్ వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓ లోక్ పాల్ ను ఏర్పాటు చేయాలని బీజేపీని అడగాలని ప్రశాంత్ భూషణ్ కు సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News