: చైనాలో ఆన్ లైన్ వ్యాపారం ఎక్కువగా మొబైళ్ల ద్వారానే!


చైనాలో ఆన్ లైన్ వ్యాపారం పీసీల నుంచి మొబైల్ ఫోన్లకు మారిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జరిగిన కొనుగోళ్ల ఆధారంగా మొబైళ్లు ఆన్ లైన్ వ్యాపారంలో కీలక పాత్ర పోషించాయని వారు వెల్లడించారు. గతంలో పీసీలు, ల్యాప్ టాప్ ల ద్వారా జరిగే వ్యాపారాన్ని మొబైల్ కొనుగోళ్లు అధిగమించాయని వారు వివరించారు. మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసే వారి సంఖ్య 50.8 శాతానికి చేరిందని వారు వెల్లడించారు. సుమారు 594 మిలియన్ల మంది స్మార్ట్ ఫోన్ ల ద్వారా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని ఐ రీసెర్చ్ సంస్థ తెలిపింది. దీనికి కారణం చైనాలో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గడమేనని వారు వివరించారు.

  • Loading...

More Telugu News