: పరిశ్రమ కోసం తీసుకున్న భూమిలో మామిడి తోట వేసిన రేణుకా చౌదరి?

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరిపై సీపీఎం తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో పరిశ్రమ పెడతామని ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలో 43 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి రేణుక తీసుకున్నారని... అయితే, ఆ స్థలంలో పరిశ్రమ స్థాపించకుండా, మామిడి తోట వేశారని సీపీఎం నేతలు ఆరోపించారు. ఆక్సికో అనే పేరుతో కంపెనీ పెడతామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భూమిని తీసుకునే సమయంలో రేణుక చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో, రేణుక తీసుకున్న భూమిలో సీపీఎం నేత కాసాని ఐలయ్య ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు పాతారు.

More Telugu News