: బెంగళూరులో బ్యాడ్ వెదర్... శంషాబాదులో నిలిచిపోయిన విమానాలు
శీతాకాలం వచ్చేసింది. పలు ప్రాంతాలను పొగ మంచు కప్పేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాదు, విశాఖ సహా పలు నగరాలు, పట్టణాల్లో తెల్లవారి ఉదయం 9 గంటలవుతున్నా, పొగమంచు దుప్పటి వీడటం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరును కూడా పొంగ మంచు కప్పేసింది. పలితంగా విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ లకు చెందిన విమానాలన్నీ హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి క్యూ కట్టాయి. ప్రస్తుతం బెంగళూరు వెళ్లాల్సిన విమానాలన్నీ శంషాబాదులో దిగడంతో విమానాశ్రయంలో రద్దీ నెలకొంది.