: ‘ఓటుకు నోటు’ దర్యాప్తును సీబీఐకి ఇవ్వలేం... హైకోర్టు స్పష్టీకరణ

తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు కేసులను సీబీఐకి బదలాయించాలన్న పిటిషన్ లో ప్రజా ప్రయోజనం తమకేమీ కనిపించలేదని వ్యాఖ్యానించిన హైకోర్టు డివిజన్ బెంచ్ నిన్న కుండబద్దలు కొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓ ఎమ్మెల్యే ఓటును కొనేందుకు మరో ఎమ్మెల్యే యత్నించడం, రెండు రాష్ట్రాల మధ్య పెను వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ కేసుల దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి బదలాయించాలని న్యాయవాది పీవీ కృష్ణయ్య పిల్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ లో ప్రజా ప్రయోజనం కనిపించలేదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కారణంగానే కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించడం కుదరదని చెప్పిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.

More Telugu News