: మేకతో దోస్తీ కట్టిన పులి... భిన్న జాతుల స్నేహమాధుర్యం!
జాతి వైరం కారణంగా పులికి మేక ఎదురుపడితే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. దీనికి భిన్నంగా మేకతో స్నేహం చేస్తూ, దాంతో ఆడుకుంటూ, దానికి రక్షణగా ఉంటున్న ఓ పులి వాస్తవ గాథ ఇది. ఈ వింతను, వైచిత్రిని చూస్తూ ఏమనాలో తెలీక రష్యాలోని మాస్కో, స్కోటోవిస్కీ సఫారీ పార్కులో సిబ్బంది ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. గత వారం రోజులుగా ఓ పులి, మేకతో స్నేహం చేస్తోంది. ఉదయం లేవగానే పులి దట్టమైన అడవిలోకి వేటకు వెళ్తుంది. దానిని అనుసరిస్తూ మేక అడవిలోకి వెళ్తుంది. సాయంత్రం వెనక్కి వచ్చి, పులి పడుకునే ఎన్ క్లోజర్ లోనే మేక పడుకుంటుంది. వారం రోజులుగా జరుగుతున్న ఈ వింతను సిబ్బంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.