: అమీర్ ఖాన్ వివాదంపై మండిపడ్డ పూరీ జగన్నాథ్

అమీర్ ఖాన్ వివాదంపై ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ మండిపడ్డాడు. అమీర్ ఖాన్ అంశంలో అతని ఆలోచన ఏంటనేది అర్థం చేసుకునే ఆలోచనలో ఎవరూ లేరని, అంతా వివాదం చేయడంలో బిజీగా ఉన్నారని అభిప్రాయపడ్డాడు. పనికి మాలినవాళ్లే అమీర్ ఖాన్ అంశంలో వివాదం రేపుతున్నారని పేర్కొన్నాడు. కేవలం సెలబ్రిటీ కావడం వల్లే ఈ వివాదం అతనికి పులుముతున్నారని అన్నాడు. అమీర్ ఖాన్ ఆల్ ఖైదా, ఐసిస్ లేక ఏదయినా తీవ్రవాద సంస్థకు చెందిన సభ్యుడైతే ఎవరైనా ఇలా స్పందించి ఉండేవారా? అంత ధైర్యం ఎవరిలోనైనా ఉందా? అని నిలదీశాడు.

More Telugu News