: మైక్రో ఫైనాన్స్ విభాగంలో అతి తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేసిన ఎస్.కె.ఎస్
తామందిస్తున్న సూక్ష్మ రుణ విభాగంలో ప్రస్తుతమున్న వడ్డీ రేటు 20.75 శాతాన్ని 19.75 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్.కె.ఎస్ మైక్రో ఫైనాన్స్ శుక్రవారం నాడు వెల్లడించింది. ఈ నిర్ణయం డిసెంబర్ 7 నుంచి అమలవుతుందని తెలిపింది. సంస్థకు ప్రధాన ఆదాయ మార్గంగా ఉన్న మైక్రో ఫైనాన్స్ విభాగంలో మరింత మార్కెట్ వాటాను నమోదు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, ఈ నిర్ణయంతో ఇండియాలో 20 శాతానికన్నా తక్కువ వడ్డీకి రుణాలిచ్చేందుకు ముందుకొచ్చిన తొలి సూక్ష్మరుణ సంస్థగా ఎస్.కె.ఎస్ నిలిచింది. అక్టోబరు 2014 తరువాత ఎస్.కె.ఎస్ వడ్డీ రేట్లను తగ్గించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.