: కుల దైవానికి ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు... మనవడి తలనీలాల సమర్పణ పూర్తి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో కుల దైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తన మవనడు దేవాన్ష్ కు తలనీలాలు తీయించేందుకు నిన్న సాయంత్రమే నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు నేటి ఉదయమే నాగాలమ్మ గుడికి చేరుకున్నారు. కుల దైవమైన నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు తన మవనడి పుట్టువెంట్రుకలు తీయించే కార్యక్రమాన్ని కొద్దిసేపటి క్రితం పూర్తి చేశారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా నాగాలమ్మ గుడి వద్ద అధికారులు చలవ పందిళ్లను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఫ్యామిలీతో పాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా ఒకేసారి గ్రామానికి రావడంతో నారావారిపల్లెలో సందడి వాతావరణం నెలకొంది.

More Telugu News