: విజయ్ 5, సాహా 7, రహానే 9... సేమ్ టు సేమ్!

నాగపూర్ టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో ఎలా ఆడిందో, ఇండియా రెండో ఇన్నింగ్స్ దాదాపు అలాగే సాగుతోంది. ధవన్ 39, పుజారా 31 పరుగులు మినహాయిస్తే, మరే ఇతర బ్యాట్స్ మెన్ 20 పరుగులకు మించి చేయలేకపోయారు. కెప్టెన్ కోహ్లీ 16 పరుగులకు అవుట్ కాగా, ఓపెనర్ మురళీ విజయ్ 5, వృద్ధిమాన్ సాహా 7, రహానే 9 పరుగులు మాత్రమే చేసి నిరుత్సాహపరిచారు. ప్రస్తుతం రోహిత్ 6, జడేజా 5 పరుగులతో క్రీజులో ఉండగా, భారత స్కోరు 35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు. ఇండియా 264 పరుగుల లీడింగ్ లో ఉంది.

More Telugu News