: బీజేపీకి మేలు చేసిన అమీర్ ఖాన్... కొట్టుకుపోతున్న 'అసహనం'!

అసహనం... ఇటీవలి కాలంలో ఇండియాలో తరచుగా వినిపిస్తున్న మాట. ఎందరో కవులు, కళాకారుల నోటి నుంచి వచ్చిన మాట. అధికార బీజేపీని ఎన్నో ఇబ్బందులు పెట్టిన మాట. విపక్షాలకు ఆయుధంగా మారిన మాట. ఇన్నాళ్లూ చాలా మంది నోటికి పనిపెట్టిన, ఈ 'అసహనం' ఇప్పుడు కొట్టుకుపోతోంది. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మత అసహనంపై చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎంతో మేలు జరిగింది. ఆయన వ్యాఖ్యలు సరికాదంటూ, హిందూ సమాజంతో పాటు ఎంతో మంది భారతీయులు విరుచుకుపడుతున్నారు. "భారత ముస్లింకు ఇండియాకన్నా మంచి దేశం, హిందువుల వంటి మంచి పొరుగువాళ్లు దొరకరు" అన్న బీజేపీ మాటలను భారతావని ఆహ్వానిస్తోంది. ఈ మాటలు సరైనవేనా? అని ఓ ప్రముఖ దినపత్రిక ఆన్ లైన్ పోల్ నిర్వహించగా, 88 శాతం మంది 'అవును' అని చెప్పారు. ఇక అమీర్ ఖాన్ ఏ ఆలోచనలో ఉండి ఈ వ్యాఖ్యలు చేశారోగానీ, ఒక రకంగా బీజేపీకి కాస్తంత ఊరట లభించినట్లయింది. భారత ప్రజలు ప్రస్తుతానికి 'అసహనం' అన్న మాటను పక్కనబెట్టి, అమీర్ ను తిడుతూ, బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.

More Telugu News