: హైదరాబాద్ సిటీలో రేపు నీటిసరఫరా ఉండని ప్రాంతాలు!
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు హెచ్ఎండబ్ల్యుఎస్&ఎస్ బి అధికారులు వెల్లడించారు. లింగంపల్లి రిజర్వాయర్ పరిధి నుంచి శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిల్ కు గోదావరి జలాలను మళ్లించే నిమిత్తం మంజీరా ఫేజ్-I & ఫేజ్-IIIకు సంబంధించిన రెండు పైప్ లైన్ల పనులు చేపడుతున్నట్లు చెప్పారు. దీంతో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి నల్లాల ద్వారా నీటి సరఫరా ఉండని ప్రాంతాలు... చందానగర్, శివాజీ నగర్, హఫీజ్ పేట్, మియాపూర్, మదీనాగూడ, మైత్రి నగర్, సాయినగర్, యూత్ కాలనీ, ఓల్డ్ లింగంపల్లి, హుడా కాలనీ, నల్లగండ్ల, ఖాజాగూడ, మోతీనగర్, నెహ్రూనగర్, బాపునగర్, ఆదర్శనగర్, పటాన్ చెరువు, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్(ఎంఐజీ) కాలనీలు ఉన్నాయి. వీటితో పాటు ఫతేనగర్, బాలానగర్, మూసాపేట్, అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్, బంజారాహిల్స్, బోరబండ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా గురువారం నాడు నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.