: వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం చేయాలని కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై సీఎం సమీక్ష చేపట్టారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. వాటర్ గ్రిడ్ పథకం పట్ల దేశమంతా ఆసక్తిగా చూస్తోందని, గ్రిడ్ పనులను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు నీళ్లివ్వకుంటే ఓట్లు అడగబోమని, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో జాప్యం వద్దని కూడా ఆదేశాలిచ్చారు. భూసేకరణ, డిజైనింగ్, బిల్లుల చెల్లింపు పనులలో ఆలస్యం కాకుండా విధానాలు సరళీకృతం చేశామని పేర్కొన్నారు.