: మూడో టెస్టు నేటి నుంచే... టీమిండియాది స్పిన్ మంత్రమే!

ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య మూడో టెస్టు నేటి నుంచి జరుగుతుంది. ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లో తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. రెండో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలవడంతో డ్రాగా ముగిసింది. దీంతో 1-0 ఆధిక్యం సాధించిన టీమిండియా మూడో టెస్టులో విజయంపై కన్నేసింది. తొలి టెస్టులోనే కాక రెండో టెస్టులోనూ స్పిన్ మాయాజాలంతో సఫారీలను తిప్పేసిన టీమిండియా నేటి టెస్టులోనూ అదే మంత్రాన్ని ప్రయోగించనుంది. మరోవైపు వన్డే, టీ20 టైటిళ్లను సునాయాసంగా చేజిక్కించుకున్న సఫారీలు టెస్టులో టీమిండియా నుంచి ఊహించని రీతిలో ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. కనీసం మూడో టెస్టులోనైనా సత్తా చాటాలని సఫారీలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో నాగ్ పూర్ వేదికగా జరగనున్న టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. తొలి రెండు టెస్టుల్లో ఆడిన ఆటగాళ్లతోనే ఇరు జట్లు బరిలోకి దిగనున్నట్లు సమాచారం. నేటి ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

More Telugu News