: ఆంధ్ర పేరు చెప్పందే బతకలేరా?: కవితకు గాలి ప్రశ్న

టీఆర్ఎస్ ఎంపీ కవితపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. ఏపీకి కేంద్రం దోచి పెడుతోందన్నట్టు కవిత మాట్లాడుతున్నారని, ఆంధ్ర రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర పేరు చెప్పందే బతకలేరా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పదవిని దృష్టిలో ఉంచుకునే కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ లోటు బడ్జెట్ ను కూడా కేంద్రం భర్తీ చేయలేదనే విషయాన్ని కవిత గుర్తించాలని చెప్పారు. ఇదే సమయంలో వైకాపాపై కూడా ఆయన మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకే వైకాపా పోటీ చేసిందని విమర్శించారు. ఓవైపు ప్రజలు వరదలతో అల్లాడుతుంటే, జగన్ ఏమాత్రం పట్టించుకోకుండా వరంగల్ లో ప్రచారం చేశారని అన్నారు.

More Telugu News