: అమెరికాలో కాల్పులు... 10 మంది మృతి, మరో 16 మందికి గాయాలు
అగ్రరాజ్యం అమెరికాలో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా నగరం న్యూఆర్లాన్స్ లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఇప్పటిదాకా 10 మంది చనిపోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వారెవరన్న విషయం వెల్లడి కాలేదు. మొన్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, నిన్న మాలి రాజధాని బొమాకోలో ఉగ్రవాదుల దాడుల తర్వాత అమెరికాలో చోటుచేసుకున్న ఈ కాల్పులపై ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.