: ట్విట్టర్లో ధోనీ కూతురి ఫొటో!... అభిమానుల ఆనందం
టీమ్ ఇండియా కెప్టెన్ ధోనీ తన కూతురు ‘జీవా’ను ఎత్తుకున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘మా అమ్మాయి ఇదిగో... చూడండి’ అన్నట్లున్న ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. రెండు చేతులతో జీవాను ఎత్తుకుని ఉన్న ఈ ఫొటోలో ధోని నవ్వుతూ పోజిచ్చాడు. జీవా కూడా చక్కగా ఫొటోకు పోజిచ్చింది. కాగా, టెస్టు ఫార్మాట్ లో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ వన్డే, టీ 20ల్లో టీమ్ ఇండియా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.