: ఏపీకి ప్రత్యేక హోదానే మా ఎజెండా... వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనన్న ఎజెండాతోనే రానున్న పార్లమెంటు సమావేశాలకు హాజరుకానున్నట్లు వైపీసీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 26 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీలతో హైదరాబాదులోని లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఈ భేటీ ముగిసిన తర్వాత మేకపాటి మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ దిశగా పోరాటాన్ని కొనసాగించాలని కూడా తీర్మానించామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

More Telugu News